సంచలన ప్రకటన చేసిన భారత కెప్టెన్

భారత ఫుట్‌బాల్ ఐకాన్ సునీల్ ఛెత్రి సంచలన ప్రకటన చేశాడు.

By M.S.R  Published on  16 May 2024 7:03 AM
india, football, sunil chhetri, sports,

సంచలన ప్రకటన చేసిన భారత కెప్టెన్

జూన్ 6న కువైట్‌తో జరిగే FIFA వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు భారత ఫుట్‌బాల్ ఐకాన్ సునీల్ ఛెత్రి గురువారం నాడు ప్రకటించారు. జాతీయ జట్టు కెప్టెన్ తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసిన వీడియోలో తన నిర్ణయాన్ని పంచుకున్నారు. ఛెత్రి భారతదేశం తరపున 145 మ్యాచ్‌లు ఆడాడు, 20 ఏళ్ల కెరీర్‌లో 93 గోల్స్ చేశాడు.

ఈ విషయం గురించి నేను మా అమ్మ, మా నాన్న, నా భార్యకు చెప్పాను. కానీ అమ్మ, భార్య నేరుగా ఏడుపు ప్రారంభించారని తెలిపాడు సునీల్ ఛెత్రి. తనతో పని చేసిన కోచ్, తనతో కలిసి ఆడిన ఆటగాళ్లకు.. తన ప్రయాణంలో కలిసి పని చేసిన వారందరినీ ఎప్పటికీ మరచిపోలేనని అన్నాడు సునీల్. ముఖ్యంగా భారత జట్టు అభిమానులను చాలా మిస్ అవుతుంటానని చెప్పుకొచ్చాడు.

Next Story