మరో ఘనత సాధించిన జస్ప్రీత్‌ బుమ్రా

అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్‌లో చేరిపోయాడు

By Srikanth Gundamalla  Published on  20 Sept 2024 5:29 PM IST
మరో ఘనత సాధించిన జస్ప్రీత్‌ బుమ్రా

టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా గురించి అందరికీ తెలిసిందే. అతను వికెట్లు పడగొట్టడంలో దిట్ట. తాజాగా ఈ పేసర్‌ హవాను కొనసాగిస్తున్నాడు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో మరో ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల లిస్ట్‌లో చేరిపోయాడు. చెన్నై వేదికగా భారత్ , బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచో జరుగుతోంది. హసన్ మహ్మద్ వికెట్ తీసి ఈ ఘనతను అందుకున్నాడు బుమ్రా. ఈ మ్యాచ్ లో మొత్తం నాలుగు వికెట్లు తీసుకున్న బుమ్రా వికెట్ల సంఖ్యను 401కు పెంచుకున్నాడు.

తొలి టెస్టు మ్యాచ్‌లో ఫస్ట్‌ బాల్‌కే బుమ్రా వికెట్ పడగొట్టి ప్రత్యర్థులను చిక్కుల్లో పడేశాడు. రహీం,తస్కిన్ అహ్మద్, హసన్ మహమ్మద్‌ వికెట్లను బుమ్రా తీసుకున్నారు. 2016లో తొలిసారి ఆస్ట్రేలియాపై బుమ్రా వన్డే ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అదే సంవత్సరం తొలిసారి టీ20 మ్యాచ్‌ ఆడాడు. కానీ.. టెస్టు క్రికెట్‌లోకి మాత్రం బుమ్రా 2018లో అడుగుపెట్టాడు. ఇప్పటి దాకా బుమ్రా 89 వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడి 149 వికెట్లు తీసుకున్నాడు. ఇక టీ20 మ్యాచ్‌లు 70 ఆడగా.. 39 వికెట్లు తీసుకున్నాడు. 39 టెస్టులు ఆడగా.. 159 వికెట్లను తీసుకున్నాడు బుమ్రా.

Next Story