కేఎల్ రాహుల్ గాయానికి శస్త్ర చికిత్స.. విజయవంతం

భారత స్టార్ బ్యాటర్, ఐపీఎల్ జట్టు లక్నోసూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయానికి శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఈ విషయాన్ని రాహుల్

By అంజి  Published on  10 May 2023 4:00 PM IST
Indian batter, K.L. Rahul,  surgery, IPL 2023

కేఎల్ రాహుల్ గాయానికి శస్త్ర చికిత్స.. విజయవంతం 

భారత స్టార్ బ్యాటర్, ఐపీఎల్ జట్టు లక్నోసూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయానికి శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఈ విషయాన్ని రాహుల్బుధవారం స్వయంగా వెల్లడించాడు. అతని కుడి తొడకు అయిన గాయానికి మంగళవారం శస్త్ర చికిత్స జరిగిందని.. వీలైనంత త్వరగా మైదానంలోకి రావాలని ఎదురుచూస్తున్నానని రాహుల్ తెలిపాడు. శస్త్ర చికిత్స సజావుగా జరిగినందుకు వైద్యులు, వైద్య సిబ్బందికి రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ తర్వాత తాను క్షేమంగా ఉన్నానని రాహుల్ చెప్పారు.

లక్నోలో గతవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. దాని వల్ల అతను ఐపీఎల్ తో పాటు జూన్ లో ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ ను భారత జట్టులోకి తీసుకున్నారు. గాయం వల్ల రాహుల్ టీ20 పోటీతో పాటు డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ నుంచి తప్పుకున్నారు. శస్త్రచికిత్స పై రాహుల్ మామ సునీల్ శెట్టి, భార్య ఆథియా స్పందించారు. రాహుల్ త్వరగా కోలుకోవాలని సునీల్ శెట్టి, అతియా ఆకాంక్షించారు.

Next Story