భారత బ్యాడ్మింటన్ దిగ్గజం కన్నుమూత
Indian Badminton great Nandu Natekar passed away.భారత బ్యాడ్మింటన్ దిగ్గజం నందు నటేకర్ కన్నుమూశారు.
By తోట వంశీ కుమార్ Published on 28 July 2021 1:05 PM ISTభారత బ్యాడ్మింటన్ దిగ్గజం నందు నటేకర్ కన్నుమూశారు. వృద్దాప్య కారణాలతో బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. గత మూడు నెలలుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు కుమారుడు గౌరవ్, ఇద్దరు కుమారైలు ఉన్నారు.
1950-60 మధ్య కాలంలో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ నుంచి సూపర్‌స్టార్‌గా వెలుగొందారు. తన కెరీర్‌లో 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాదించారు. 1956లో ఇంటర్నేషనల్ మలేషియాలో సెల్లంజర్ ఇంటర్నేషనల్ లో టోర్నమెంట్లో విజయం సాధించారు. 1954లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. థామస్ కప్‌లో 16 సింగిల్స్ మ్యాచ్‌లో 12 విజయాలు.. అలాగే టీమ్ తరపున 16 డబుల్స్ మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించారు. బ్యాడ్మింటన్‌లో నందు సాధించిన విజయాలకు కేంద్ర ప్రభుత్వం 1961లో అర్జున అవార్డు ప్రధానం చేసింది. 1965లో జమైకాలో జరిగిన కామెన్ వెల్త్ గేమ్స్ లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించారు.
నందు నటేకర్ ఇంట్లోనే సహజ మరణం చెందారని నటేకర్ కుటుంబ సభ్యులు తెలిపారు. 'మూడు నెలలుగా ఆయన కాస్త నలతగా ఉంటున్నారని..మేమెంతో ప్రేమించే మా నాన్న ఈరోజు చనిపోయారనే విషయాన్ని బాధాతప్త హృదయంతో తెలియజేస్తున్నాం. కరోనా కారణంగా మేం ఎలాంటి సంతాప కార్యక్రమం ఏర్పాటు చేయడం లేదు. మీరంతా ఆయన్ను మనసులోనే స్మరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని' వారు తెలిపారు.