క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్‌

Indian all rounder Stuart Binny Retires from International cricket.టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ స్టువ‌ర్ట్ బిన్ని అంత‌ర్జాతీయ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2021 6:00 AM GMT
క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్‌

టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ స్టువ‌ర్ట్ బిన్ని అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని పార్మాట్ల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు బిన్నీ తెలిపాడు. తాను తీసుకున్న నిర్ణ‌యం త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని చెప్పాడు. టీమ్ఇండియా త‌రుపున బిన్ని 6 టెస్టులు, 14 వ‌న్డేలు, 3 టీ20 మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో 194 ప‌రుగులు చేయ‌డంతో పాటు 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. వ‌న్డేల్లో 230 ప‌రుగులు చేయ‌డంతో పాటు 20 వికెట్లు, టీ20ల్లో 35 ప‌రుగులు చేయ‌డంతో పాటు ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

కాగా.. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఓ వన్డేలో అద్భుతమైన ఘనత సాధించాడు.ఢాకా వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టీమ్ఇండియా 105 పరుగులకే కుప్ప‌కూలింది. ఇక భార‌త జ‌ట్టు ఓట‌మి త‌ప్ప‌ద‌ని అంతా బావిస్తుండ‌గా.. బిన్ని అద్భుతం చేశాడు. త‌న కెరీర్‌లోనే అత్యుత్త‌మ గ‌ణాంకాలు న‌మోదు చేశాడు. 4 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు. భార‌త వన్డే క్రికెట్‌లో టీమ్ఇండియా త‌రుపున అత్యుత్త‌మ బౌలింగ్ గణాంకాలు బిన్నీ (6/4)వే కావడం గ‌మ‌నార్హం.

భారత మాజీ ఆటగాడు రోజర్ బిన్నీ కొడుకే స్టువర్ట్ బిన్నీ. 1983 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రోజర్ బిన్నీ అడుగు జాడల్లోనే ఆయన కొడుకు స్టువర్ట్ బిన్నీ క్రికెటర్‌గా మారాడు. అయితే.. నిల‌క‌డ లేమీ కార‌ణంగా జ‌ట్టులో స్థానం కోల్పోయాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 95 మ్యాచ్‌లు ఆడిన బిన్నీ 4796 పరుగులు చేసి, బౌలింగ్‌లో 146 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో 95 మ్యాచ్‌లను ఆడాడు. 880 పరుగులు చేశాడు. 22 వికెట్లను పడగొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 130గా ఉంది. 2016లో వెస్టిండీస్‌పై చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడాడు. కామెంటేటర్ మయాంతి లాంగర్‌ను పెళ్లి చేసుకున్నాడు.

Next Story
Share it