కరోనా ఎవ్వరినీ వదలదు.. భారత మ‌హిళ‌ల టీ20 కెప్టెన్ కు కూడా పాజిటివ్..!

Harmanpreet Kaur - COVID-19 positive. భారత మహిళల జట్టు టీ20 కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.

By Medi Samrat  Published on  30 March 2021 6:22 AM GMT
Harmanpreet Kaur

కరోనా మహమ్మారి బారిన భారత్ లో పలువురు ప్రముఖులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా క్రికెటర్లు కూడా కరోనా బారిన పడ్డారు. ఎంతో జాగ్రత్తగా ఉండే ప్లేయర్స్ కూడా కరోనా బారిన పడుతూ ఉండడంతో అధికారులు కాస్త షాక్ లో ఉన్నారు. భారత మహిళల జట్టు టీ20 కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. జ్వరం రావడంతో సోమవారం పరీక్ష చేయించుకోగా కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో హర్మన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నారని, త్వరలోనే కోలుకుంటారని ఆమె సన్నిహితులు తెలిపారు.

టీమిండియా దిగ్గజాలు కూడా కరోనా బారిన పడ్డాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండుల్కర్‌కు కూడా కరోనా సోకింది. రోడ్ సేఫ్టీ వ‌ర‌ల్డ్ సిరీస్‌లో పాల్గొన్న ఆట‌గాళ్లకు వ‌రుస‌గా క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అవుతోంది. శుక్ర‌వారం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌, శ‌నివారం మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్‌కు క‌రోనా సోకగా.. ఆదివారం మాజీ బ్యాట్స్‌మన్‌ ఎస్‌ బద్రీనాథ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక సోమవారం మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయ్యింది. ఇర్ఫాన్ పఠాన్‌కు కరోనా సోకడంతో రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో పాల్గొన్న వారిలో క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన సిరీస్‌లో సచిన్, యూసఫ్, బద్రీనాథ్, ఇర్ఫాన్ ఇండియా లెజెండ్స్ తరుపున బరిలోకి దిగారు.


Next Story
Share it