కుమ్మేసిన అమ్మాయిలు.. 78 పరుగుల తేడాతో యూఏఈ పై భారీ విజయం
శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2024లో భారత్ ఈరోజు యూఏఈతో తలపడింది.
By Medi Samrat Published on 21 July 2024 12:48 PM GMTశ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2024లో భారత్ ఈరోజు యూఏఈతో తలపడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా 78 పరుగుల తేడాతో యూఏఈని ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించింది. దీంతో భారత్ తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ను నేపాల్‌తో జూలై 23న ఆడనుంది. యూఏఈపై విజయం సాధించి గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది.
దంబుల్లాలోని రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం యూఏఈ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది.
202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బయలుదేరిన యూఏఈకి శుభారంభం లభించలేదు. 11 పరుగుల స్కోరు వద్ద తొలి దెబ్బ తగిలింది. రేణుకా సింగ్ తీర్థ సతీష్‌ను ఔట్ చేసింది. ఆమె కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రినితను పూజా అవుట్ చేసింది. ఆమె కేవలం ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ లర్వాత సమైరా ఐదు పరుగుల వద్ద ఔటయ్యింది. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఇషా ఓజా 38 పరుగులతో ఇన్నింగ్స్ ఆడింది. ఖుషీ 10 పరుగులు, హీనా ఎనిమిది పరుగులు, రితిక ఆరు పరుగులు చేసి అవుటయ్యారు. కవిషా 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. భారత్ తరఫున దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా, రేణుక, తనూజ, పూజ, రాధలకు తలో వికెట్ దక్కింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో షెఫాలీ వర్మ(37 పర్వాలేదనిపించగా.. స్మృతి మంధాన(13), దయాళన్ హేమలత(2) త్వరగా అవుటయ్యారు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌ(66), వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిచా గోష్ 29 బంతులు ఎదుర్కొని 64 పరుగులు చేయడంతో భారత్ 210 పరుగుల భారీ స్కోరు సాధించింది.