ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-జింబాబ్వే మధ్య మూడో మ్యాచ్ బుధవారం సాయంత్రం జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఓటమి పాలయ్యింది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది.
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 182 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో మూడో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. రితురాజ్ గైక్వాడ్ కూడా 49 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
జింబాబ్వే తరుపున మైయర్స్ 49 బంతుల్లో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడు తన మొదటి T20 ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీని 45 బంతుల్లో సాధించాడు. భారత్ తరఫున సుందర్ మూడు వికెట్లు, అవేశ్ రెండు వికెట్లు తీశారు. ఖలీల్ ఒక వికెట్ పడగొట్టాడు.