మూడో వ‌న్డే.. హార్థిక్ పాండ్య‌, ఉమ్రాన్ మాలిక్ ఔట్‌.. సూర్య‌కుమార్ ఇన్‌.. కార‌ణం ఇదే

India vs Sri Lanka 3rd ODI Rohit opts to bat first.భార‌త్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే ప్రారంభ‌మైంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jan 2023 8:18 AM GMT
మూడో వ‌న్డే.. హార్థిక్ పాండ్య‌, ఉమ్రాన్ మాలిక్ ఔట్‌.. సూర్య‌కుమార్ ఇన్‌.. కార‌ణం ఇదే

తిరువ‌నంత‌పురం వేదిక‌గా భార‌త్‌, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు స‌హ‌క‌రిస్తుంద‌ని బావిస్తుండ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు హిట్‌మ్యాన్ వెల్ల‌డించాడు. మూడు వ‌న్డేల సిరీస్‌ను ఇప్ప‌టికే గెలుచుకున్న‌ప్ప‌టికి జ‌ట్టులో మెరుగుప‌డాల్సిన విష‌యాలు చాలా ఉన్నాయ‌ని చెప్పాడు. ఈ మ్యాచ్‌ను కూడా తేలిక‌గా తీసుకోమ‌ని, ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చేందుకు కృషి చేయ‌నున్న‌ట్లు తెలిపాడు. ఇక జ‌ట్టులో రెండు మార్పులు చేసిన‌ట్లు పేర్కొన్నాడు.

హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్‌లకు విశ్రాంతి ఇచ్చారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే ఈ ఇద్దరికి విశ్రాంతి ఇచ్చిన‌ట్లు హిట్‌మ్యాన్ చెప్పాడు. వీరి ప్లేసులో సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ జ‌ట్టులోకి వ‌చ్చారు.

ఇక లంక జ‌ట్టులోనూ రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. అషెన్ బండారా, జెఫ్రీ వండర్సే జట్టులోకి వ‌చ్చారు.

భారత జ‌ట్టు : రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్‌ రాహుల్‌, వాషింగ్టన్ సుందర్, అక్షర్‌ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్‌.

శ్రీలంక జ‌ట్టు : అవిష్క ఫెర్నాండో, నువనిందు ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌, అషెన్ బండార, చరిత్ అసలంక, డసనన్ షనక, వానిందు హసరంగ, జాఫ్రె వండర్సే, కసున్ రజిత, లాహిరు కుమారా.

Next Story
Share it