రేపు భారత్‌-పాకిస్థాన్ మ్యాచ్.. పూర్తి వివ‌రాలివే...

మహిళల ఆసియా కప్ 2024 జూలై 19 నుంచి ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో తొలిరోజే భారత్‌-పాక్‌లు హోరాహోరీ తలపడనున్నాయి

By Medi Samrat  Published on  18 July 2024 5:29 PM IST
రేపు భారత్‌-పాకిస్థాన్ మ్యాచ్.. పూర్తి వివ‌రాలివే...

మహిళల ఆసియా కప్ 2024 జూలై 19 నుంచి ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో తొలిరోజే భారత్‌-పాక్‌లు హోరాహోరీ తలపడనున్నాయి. దంబుల్లాలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ పాకిస్థాన్‌పై భారత మహిళల జట్టు పైచేయి సాధించింది. ఇరు జట్ల మధ్య మొత్తం 14 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 11, పాకిస్థాన్ 3 సార్లు గెలిచాయి.

ఇరు జట్ల మ‌ధ్య‌ చివరి ఐదు మ్యాచ్‌ల విష‌యానికొస్తే.. భారత్ మూడు గెలిచింది, ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఒక్క మ్యాచ్ ఫలితం లేదు. మరోవైపు పాకిస్తాన్ తన ఐదు టీ20 మ్యాచ్‌లలో ఒకదానిలో మాత్రమే విజయం సాధించగా.. నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. టోర్నీలో పాకిస్థాన్ మహిళల జట్టుపై విజయం సాధించడం ద్వారా భారత జట్టు శుభారంభం చేయాలని భావిస్తోంది.

మహిళల ఆసియా కప్‌లో భాగంగా శుక్రవారం జులై 19న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. దంబుల్లాలోని రాంగిరి క్రికెట్ స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు.

Next Story