మ్యాచ్‌ టికెట్‌ కోసం ట్రాక్టర్ అమ్మేసిన పాక్ అభిమాని.. మళ్లీ నిరాశే..!

టీ20 వరల్డ్‌ కప్‌లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్, పాకిస్థాన్ మధ్య లోస్కోరింగ్‌ మ్యాచ్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగింది.

By Srikanth Gundamalla  Published on  10 Jun 2024 9:30 AM GMT
india vs pakistan, t20 world cup,  tractor

 మ్యాచ్‌ టికెట్‌ కోసం ట్రాక్టర్ అమ్మేసిన పాక్ అభిమాని.. మళ్లీ నిరాశే..!

టీ20 వరల్డ్‌ కప్‌లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్, పాకిస్థాన్ మధ్య లోస్కోరింగ్‌ మ్యాచ్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. టీమిండియా మరోసారి పాకిస్థాన్‌పై ఆదిపత్యాన్ని చూపించింది. పైచేయి ఎప్పటికీ మనదే అని నిరూపించింది. న్యూయార్క్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఇండియా 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

న్యూయార్క్‌ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌ టికెట్ల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అయినా సరే అభిమానులు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో వేల డాలర్లు పెట్టి టికెట్‌ తీసుకుని మ్యాచ్‌ను తిలకించారు. పలుమార్లు వరణుడు మ్యాచ్‌కి అడ్డంకి కలిగించినా.. లో స్కోరింగ్‌లో కూడా విజయం సాధించడంతో ఇండియా అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కేరింతలు కొడుతూ న్యూయార్క్‌ నగరమంతా తిరిగారు. మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించారు. మరోవైపు స్టేడియం వద్ద కూడా కోలాహలం కనిపించింది. భారత పౌరులు ఉత్సాహంతో సందడి చేస్తూ.. జీతేగా భారత్‌ అంటూ నినాదాలు చేశారు.

పాక్‌కు చెందిన ఓ అభిమాని పాకిస్తాన్‌ టీమ్‌పై నిరాశ వ్యక్తం చేశాడు. భారత్‌ తక్కువ టార్గెట్‌ ముందుంచడంతో.. గెలుపు తథ్యమని భావించామని అన్నాడు. కానీ.. మ్యాచ్‌లో పాక్‌ ఓడిపోవడం చాలా బాధకలిగించిందని చెప్పాడు. అయితే.. ఈ మ్యాచ్‌ టికెట్‌ను కొనేందుకు తన జీవనాధారంగా ఉన్న ట్రాక్టర్‌ను అమ్మేశానని చెప్పాడు. 3వేల డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు 2లక్షల రూపాయలకు పైనే పెట్టాడట. బాబర్ ఆజాం ఔట్‌ అయ్యాక నిరుత్సాహ పడ్డామనీ.. ఈ ఫలితం తమను నిరాశ పరిచిందని అన్నాడు. చివరి వరకు పోరాడి గెలిచిన టీమిండియాను పాకిస్థాన్ ఫ్యాన్‌ అభినందనలు తెలిపాడు.

Next Story