నేడు పాకిస్థాన్ తో తలపడనున్న భారత్..!

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పాకిస్థాన్ తో తలపడనుంది.అద్భుతమైన ఫామ్ లో ఉన్న భారత్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌లో చోటు సంపాదించిన మొదటి జట్టుగా నిలిచింది

By Medi Samrat
Published on : 14 Sept 2024 1:00 PM IST

నేడు పాకిస్థాన్ తో తలపడనున్న భారత్..!

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు పాకిస్థాన్ తో తలపడనుంది. భారత్ టోర్నమెంట్‌లో అద్భుతమైన ఫామ్ లో ఉంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ కూడా నిలకడగా ఆడుతోంది. హాకీ లెజెండ్ తాహిర్ జమాన్ మార్గదర్శకత్వంలో పాకిస్థాన్ రాణిస్తోంది. మలేషియా, కొరియాపై 2-2తో డ్రా చేసుకుంది పాక్. జపాన్‌ను 2-1, చైనాను 5-1 తేడాతో ఓడించి సెమీస్ కు అర్హత సాధించింది.

భారత్ వర్సెస్ పాకిస్థాన్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ మ్యాచ్ సెప్టెంబర్ 14, 2024న జరగనుంది. చైనాలోని హులున్‌బుయిర్ సిటీలోని మోకి ట్రైనింగ్ బేస్‌ మ్యాచ్ కు వేదికగా నిలిచింది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారతదేశంలోని SonyLIV యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

Next Story