హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. అదే తరహాలో అవుట్
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రాణించాడు.
By Medi Samrat Published on 12 Feb 2025 3:16 PM IST
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రాణించాడు. 55 బంతుల్లో 52 పరుగులు చేసి కోహ్లీ పెవిలియన్ బాట పడ్డాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్ లో కీపర్ సాల్ట్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో వన్డేలో కూడా కోహ్లీ ఇదే తరహాలో అవుట్ అయ్యాడు. ఇంతకు ముందు మ్యాచ్ లో సెంచరీ కొట్టి ఫామ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపలేదు. 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మార్క్ వుడ్ వేసిన బంతికి రోహిత్ శర్మ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. కీపర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొదటి వికెట్ భారత్ 6 పరుగులకే కోల్పోగా.. రెండో వికెట్ 122 పరుగుల వద్ద కోల్పోయింది.
అహ్మదాబాద్ వేదికగా సాగుతున్న మూడో వన్డేలో మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు. ఇంగ్లండ్ జట్టులో జేమీ ఒవర్టన్ స్థానంలో టామ్ బాంటన్ ను తీసుకుంది.