రాంచీ వేదిగా ఇండియా, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కేవలం 53.5 ఓవర్లకే ఆలౌట్ అయ్యింది. స్పిన్నర్లు చెలరేగడంతో 145 పరుగులకు పది వికెట్లను కోల్పోయింది. అశ్విన్ 5 వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు.
ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే (60) పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత జానీ బెయిర్‌స్టో (30), బెన్‌ఫోక్స్ (17) కాస్త ఫర్వాలేదనిపించారు. తొలి ఇన్నింగ్స్ తర్వాత ఇంగ్లండ్ 46 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్ కేవలం 145 పరుగులే చేసింది. దాంతో.. భారత్ ఎదుట 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 353 పరుగులు చేసింది. ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో బారత్ ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్టులో విజయం సాధిస్తే టెస్టు సిరీస్ ఇండియా కైవసం కానుంది.