చైనాను ఓడించి టైటిల్ కైవ‌సం చేసుకున్న‌ భారత్‌

మంగళవారం జరిగిన ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్లో భారత హాకీ జట్టు చైనాతో తలపడింది

By Medi Samrat  Published on  17 Sep 2024 12:05 PM GMT
చైనాను ఓడించి టైటిల్ కైవ‌సం చేసుకున్న‌ భారత్‌

మంగళవారం జరిగిన ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్లో భారత హాకీ జట్టు చైనాతో తలపడింది. చైనాను 1-0తో ఓడించి భారత్‌ 5వ సారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు సోమవారం జరిగిన రెండో సెమీస్‌లో టీమిండియా 4-1తో కొరియాపై విజయం సాధించింది. అలాగే తొలి సెమీఫైనల్‌లో చైనా పెనాల్టీ షూటౌట్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోని భారత జట్టు ఫైనల్స్‌లోనూ విజయం సాధించింది. భారత్ తరఫున జుగ్రాజ్ ఒక గోల్ చేశాడు. 51వ నిమిషంలో జుగ్‌రాజ్ సింగ్ గోల్ చేశాడు. టోర్నీలో అతనికిది రెండో గోల్. హర్మన్‌ప్రీత్ సింగ్ ఇచ్చిన పాస్‌తో జుగ్రాజ్ గోల్ చేశాడు.

మొదటి 45 నిమిషాల ఆటలో.. చైనా డిఫెన్స్ ముందు భారత జట్టు నిస్సహాయంగా కనిపించింది. ఇక‌ మ్యాచ్ 43వ నిమిషంలో వివేక్ సాగర్ ప్రసాద్ గాయపడ్డాడు. ఇప్పుడు చివరి 15 నిమిషాల ఆటలో జుగ్రాజ్ గోల్ చేశాడు. ఇక ఈ సీజన్‌లో తొలి అర్ధభాగం వరకూ భారత్‌ ఎలాంటి గోల్‌ చేయకపోవడం ఇదే తొలిసారి.

Next Story