బంగ్లాదేశ్‌తో టీమిండియా ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టును భారత్ కైవసం చేసుకుంది. రెండో టెస్టులో కూడా విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే రెండో టెస్టు శుక్రవారం కాన్పూర్ వేదికగా ప్రారంభం అయ్యింది. టాస్ గెలిచిన ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
కాగా.. తొలిరోజు ఆటకు వర్షం బ్రేక్ వేసింది. మొదటి రోజు కేవలం 35 ఓవర్లు మాత్రమే బౌల్ చేశారు ఇండియా బౌలర్స్. వర్షం పడటం వల్ల ఆట నిలిచిపోయింది. 35 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ఇందులో మోమినుల్ హక్ 40 పరుగులు చేయగా.. ముషపికర్ రహీ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక భారత బౌలర్ ఆకాశ్ దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. శుక్రవారం పిచ్ చిత్తడిగా ఉండడంతో.. తొలి సెషన్ ఆలస్యంగా ప్రారంభమైంది. లంచ్ తర్వాత కూడా మరోసారి వర్షం అడ్డుపడింది. దాంతో.. చాలా సేపు వెయిట్ చేశారు. కానీ.. వర్షం ఆగకపోవడంతో ఆటకు బ్రేక్ పడింది. బంగ్లాదేశ్ మిగతా బ్యాటర్లలో ఇస్లామ్ 24, శాంతో 31 రన్స్ చేశారు.