శ్రేయ‌స్ అయ్య‌ర్‌, శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీలు.. భారీ స్కోరు దిశ‌గా భార‌త్‌

ఇండోర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.

By Medi Samrat  Published on  24 Sept 2023 5:00 PM IST
శ్రేయ‌స్ అయ్య‌ర్‌, శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీలు.. భారీ స్కోరు దిశ‌గా భార‌త్‌

ఇండోర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీం ఇండియా భావిస్తోంది. అదే సమయంలో ఆస్ట్రేలియా సిరీస్‌లో పునరాగమనం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే రుతురాజ్ గైక్వాడ్(8) రూపంలో షాక్ త‌గిలింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌(105), శుభ్‌మ‌న్ గిల్(104) కు జ‌త క‌లిశాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ వ‌చ్చి రావ‌డంతోనే ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. ఆదిలో త‌డ‌బ‌డిన శుభ్‌మ‌న్ గిల్ ఆ త‌ర్వాత పుంజుకుని బ్యాట్ ఝుళిపించాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, శుభ్‌మ‌న్ గిల్ ఇద్ద‌రూ ధాటిగా ఆడ‌టంతో ఆస్ట్రేలియా బౌల‌ర్ల ద‌గ్గ‌ర స‌మాధానం లేకపోయింది. ఇరువురు సెంచ‌రీలు పూర్తి అయ్యాక పెవిలియ‌న్ చేరారు. ప్ర‌స్తుతం క్రీజులో ఇషాన్ కిష‌న్‌, కేఎల్ రాహుల్ ఉండ‌గా.. స్కోరు 38 ఓవ‌ర్ల‌కు 3 వికెట్లు కోల్పోయి 276 ప‌రుగుల వ‌ద్ద ఉంది. 50 ఓవ‌ర్ల‌కు 400 దాటుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.

Next Story