వన్డే వరల్డ్‌కప్-2023.. భారత్-పాక్ మ్యాచ్ డేట్ మారింది తెలుసా..?
వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5 నుండి మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
By Medi Samrat Published on 9 Aug 2023 7:02 PM ISTవన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5 నుండి మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించగా.. కొన్ని కారణాల వల్ల మ్యాచ్ తేదీలను రీషెడ్యూల్ చేసింది ఐసీసీ. మొత్తం 9 మ్యాచ్‌ల తేదీలను రీషెడ్యూల్ చేసినట్లు ఐసీసీ ప్రకటించింది. టోర్నీలో టాప్ మ్యాచ్‌గా భావించే ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌తో సహా మొత్తం 9 మ్యాచ్‌ల షెడ్యూల్ మార్చినట్టు ఐసీసీ ట్వీట్ చేసింది. అంతకుముందు భారత్-పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సివుండగా.. 14వ తేదీకి మార్చింది ఐసీసీ. మరికొన్ని మ్యాచ్‌ల తేదీలు కూడా రీషెడ్యూల్ చేసింది ఐసీసీ.
Nine fixtures have been rescheduled for #CWC23.
— ICC (@ICC) August 9, 2023
Details 👇
ప్రపంచ కప్ 2023: ఈ 9 మ్యాచ్‌ల షెడ్యూల్‌లో మార్పులు
అక్టోబర్ 10 - ఇంగ్లండ్ vs బంగ్లాదేశ్ మ్యాచ్
అక్టోబర్ 10 - పాకిస్థాన్ vs శ్రీలంక మ్యాచ్
అక్టోబర్ 12 - ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా మ్యాచ్
అక్టోబర్ 13 - న్యూజిలాండ్ vs బంగ్లాదేశ్ మ్యాచ్
అక్టోబర్ 14 - భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్
అక్టోబర్ 15 - ఇంగ్లండ్ vs ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్
నవంబర్ 11 - ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ మ్యాచ్
నవంబర్ 11 - ఇంగ్లండ్ vs పాకిస్తాన్ మ్యాచ్
నవంబర్ 12 - భారత్ vs నెదర్లాండ్స్ మ్యాచ్