బీసీసీఐ ఆందోళ‌న‌.. టీమిండియా పర్యటన అయ్యే రద్దు అవ‌కాశం..!

బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేయడంతో భారత పర్యటన వాయిదా పడే అవకాశం ఉంది.

By Medi Samrat
Published on : 4 July 2025 9:15 PM IST

బీసీసీఐ ఆందోళ‌న‌.. టీమిండియా పర్యటన అయ్యే రద్దు అవ‌కాశం..!

బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేయడంతో భారత పర్యటన వాయిదా పడే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌లో గత ఏడాది రాజకీయ అస్థిరత కారణంగా షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వాన్ని దించేసిన తర్వాత పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఆగస్టు 17 నుంచి 31 వరకు చిట్టగాంగ్, ఢాకాలో భారత్ మూడు టీ20 ఇంటర్నేషనల్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

రాజకీయ అస్థిరత, నిరసనల తర్వాత బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై బీసీసీఐ అప్రమత్తంగా ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే.. సిరీస్ రద్దు కాదు అంటున్నారు. ప్రపంచ కప్ అర్హతకు వ‌న్డే ఛాంపియ‌న్ షిప్ పాయింట్ల ప్రమాదం పొంచి ఉన్నందున 2026లో నిర్వహించబడుతుంది.

బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాతే టూర్‌ను కొనసాగించాలని, శాంతిభద్రతలను చూసేందుకు అక్కడ సుస్థిర ప్రభుత్వం ఉండాల‌ని బీసీసీఐ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. బంగ్లాదేశ్‌లో ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే అవకాశం లేదు.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఉంది. ఉద్యోగాల్లో రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో గత ఏడాది ఆగస్టులో హసీనాను అధికారం నుంచి తొలగించడంతో యూనస్ బాధ్యతలు చేపట్టారు.

Next Story