కోహ్లీసేనకు కఠిన పరీక్ష.. రోహిత్‌తో ఓపెనింగ్ చేసేదెవరు..?
India tour of England 1st Test match.క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మరో ఆసక్తికర
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2021 4:01 AM GMTక్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మరో ఆసక్తికర మరోకు రంగం సిద్దమైంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాటింగ్ హామ్ వేదికగా నేడు తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) పైనల్ ఓటమిని మరిచి ఈ సిరీస్‌లో సత్తా చాటాలని భావిస్తోంది. అయితే.. సుదీర్ఘ క్వారంటైన్, ప్రాక్టీస్ లేమి, గాయాలు భారత్‌ను వెనక్కి లాగుతున్నాయి. కాగా.. ఈ పోరుతోనే డబ్ల్యూటీసీ రెండో ఎడిషన్‌ను భారత్ ప్రారంభించనుంది. 2018 సిరీస్‌లో ఇంగ్లండ్ గడ్డపై 1-4తో ఎదురైన ఓటమికి ఈ సిరీస్‌తో పగ తీర్చుకోవాలని కోహ్లీ సేన పట్టుదలతో ఉంది.
భారత్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గాయపడి స్వదేశానికి రాగా.. అతడి స్థానాన్ని భర్తీ చేస్తాడని బావించిన మయాంక్ అగర్వాల్ సైతం తొలి టెస్టు ముంగిట ప్రాక్టీస్‌లో గాయపడి మ్యాచ్‌కు దూరం అయ్యాడు. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటిన కే ఎల్ రాహుల్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. ఇక వన్‌డౌన్‌లో పుజరా, ఆ తరువాత కోహ్లీ, రహానే, పంత్ రానున్నారు. ఇషాంత్, షమీ, బుమ్రాలతో కూడా పేస్ త్రయం బాధ్యతలు పంచుకోనుంది. ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలనిఅనుకుంటే అశ్విన్‌కు తోడుగా జడేజాను బరిలోకి దించే అవకాశం ఉంది.
ఇక నయావాల్ పుజారా ఫామ్ అందిపుచ్చుకోవాల్సి ఉంది. ఇక పరుగుల యంత్రం,కెప్టెన్ కోహ్లీ నుంచి చాలా రోజులుగా భారీ ఇన్నింగ్స్ రాలేదు. కోహ్లీ శతకం చేసి దాదాపు రెండేళ్లు అయ్యింది. దీంతో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లోనైనా కోహ్లీ శతకం సాధిస్తాడని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో దుమ్మరేపిన పంత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఎలా ఎదుర్కొంటారు అన్న దానిపైనే భారత విజయావశాలు ఉన్నాయి.