భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ పూర్తవ్వగానే వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.మొదటి వన్డే నవంబర్ 30న జరగనుండగా, 3వ వన్డే మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం క్రికెట్ అభిమానులకు అధికారులు శుభవార్తను అందించింది. డిసెంబర్ 6న జరిగే భారత్–సౌతాఫ్రికా వన్డే మ్యాచ్ కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
ఈ మ్యాచుకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం ప్రారంభం కానుందని ఆంధ్ర క్రికెట్ సంఘం అధికారులు ప్రకటించారు. మొత్తం 22 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు డిసెంబర్ 4న ఇరు జట్లు విశాఖకు చేరుకోనున్నాయి. ఆ తర్వాత ప్రాక్టీస్ సెషన్లు, భద్రతా ఏర్పాట్లను అధికారులు సమీక్షించనున్నారు.