కోహ్లీ సేన‌దే ఆధిప‌త్యం..

India retains top spot in annual ICC Test Team rankings.ఐసీసీ తాజాగా విడుద‌ల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో టీమ్ఇండియా త‌న ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 May 2021 9:56 AM GMT
ICC

ఐసీసీ తాజాగా విడుద‌ల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో టీమ్ఇండియా త‌న ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తోంది. టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానాన్ని నిలుపుకుంది. 121 రేటింగ్ పాయింట్ల‌తో కోహ్లీసేన తొలి స్థానంలో నిలిచింది. ఇక కేవ‌లం ఒక పాయింట్ తేడాతో (120) న్యూజిలాండ్ జ‌ట్టు రెండో స్థానంలో కొన‌సాగుతోంది. ఇక ఇంగ్లాండ్(109) జ‌ట్టు నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగ‌బాక‌గా.. ఆస్ట్రేలియా(108) జ‌ట్టు మూడు నుంచి నాలుగో స్థానానికి ప‌డిపోయింది. ఇదిలా ఉంటే.. జూన్ 18 నుంచి 22మ‌ధ్య వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌లో భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

2020 సంవ‌త్స‌రం నుంచి జ‌రిగిన మ్యాచ్‌ల‌కు 100శాతం.. అంత‌క‌ముందు రెండేళ్ల‌కు 50 శాతం పాయింట్ల ఆధారంగా రేటింగ్స్‌ను ఇచ్చింది. 24 మ్యాచులు ఆడిన భార‌త జ‌ట్టు 2914 పాయింట్ల సాధించి తొలి స్థానంలో నిలిచింది. కివీస్ 18 టెస్టులాడి 2166 పాయింట్లు సాధించింద‌ది. మొత్తంగా విరాట్ సేన‌క ఆసీస్ పై 2-1, ఇంగ్లాండ్ పై 3-1తేడాతో గెల‌వ‌డం బాగా క‌లిసొచ్చింది. ఇక పాకిస్థాన్ (94) ఐదో స్థానంలో, వెస్టిండీస్ (84) ఆరో స్థానంలో నిలువ‌గా.. ద‌క్షిణాఫ్రికా (80) ఏడో స్థానంలో, శ్రీలంక (78) ఎనిమిద‌వ స్థానంలో బంగ్లాదేశ్ (46) తొమ్మిదో స్థానంలో, జింబాబ్వే (10) ప‌దో స్థానంలో నిలిచింది. కాగా.. ద‌క్షిణాఫ్రికా త‌న టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో తొలి సారి ఏడో స్థానానికి ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం.



Next Story