కరోనా మళ్లీ కలవరపెడుతోంది. పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా పాజిటివ్ కేసుల సంఖ్య 4 వేలకు చేరవ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,33,153 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 3,824 కొత్తగా కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య వైద్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య 27 శాతం పెరిగింది.
ప్రస్తుతం దేశంలో 18,389 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 5,30,881 ప్రాణాలు కోల్పోయారు. నిన్న 1,784 మంది కోలుకుగా మొత్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 4,41,73,335కి పెరిగింది. రోజువారి పాజిటివిటీ రేటు 2.87 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.24 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.77శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు 220.66 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.