దక్షిణాఫ్రికాతో జరుగుతున్న యూత్ వన్డే సిరీస్‌లో భారత యువ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది భారత జట్టు. క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ఆడుతున్న మూడో, చివరి వన్డేలోనూ కెప్టెన్ వైభవ్ కేవలం 63 బంతుల్లోనే విధ్వంసక శతకం బాదాడు. తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టిన వైభవ్ 127 రన్స్ చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ 106 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో మొదటి వికెట్ 25.4 వద్ద భారత్ కోల్పోయింది.