భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ డ్రా
India lift Border-Gavaskar Trophy as 4th Test ends in draw
By Medi Samrat
అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. పిచ్ నుండి బౌలర్లకు ఎటువంటి సహకారం అందకపోవడంతో ఆఖరి రోజు గంట ముందే మ్యాచ్ ను ఇరు జట్లు ప్రకటించాయి. ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 480 పరుగులు చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 480 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేసింది. ఇక సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లను భారత్ గెలవగా.. మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి భారత్ కు షాక్ ఇచ్చింది. ఆఖరి మ్యాచ్ డ్రాగా ముగియడంతో 2-1తో భారత్ సిరీస్ ను సొంతం చేసుకుంది.
ఇక భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లోకి అడుగుపెట్టింది. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో శ్రీలంక ఓడిపోవడంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరింది. శ్రీలంక నిర్దేశించిన 285 పరుగుల లక్ష్యాన్ని 8 ఎనిమిది వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ ఛేదించింది. దీంతో ఆస్ట్రేలియాతో చివరిదైన నాలుగో టెస్టులో గెలుపోటములతో సంబంధం లేకుండా టీమిండియా ఫైనల్ బెర్తు దక్కించుకుంది.