రింకూ సింగ్‌తో ఉన్న ఆ 'మిస్టరీ గర్ల్' ఎవరో తెలుసా.? స్టార్ క్రికెట‌ర్ చెల్లెలు అంటున్నారే..!

ప్రస్తుతం భారత్-జింబాబ్వే మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుండగా.. ఇందులో రెండు మ్యాచ్‌లు గెలిచి 2-1తో టీమ్ ఇండియా ఆధిక్యంలో ఉంది

By Medi Samrat  Published on  12 July 2024 4:38 PM IST
రింకూ సింగ్‌తో ఉన్న ఆ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసా.? స్టార్ క్రికెట‌ర్ చెల్లెలు అంటున్నారే..!

ప్రస్తుతం భారత్-జింబాబ్వే మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతుండగా.. ఇందులో రెండు మ్యాచ్‌లు గెలిచి 2-1తో టీమ్ ఇండియా ఆధిక్యంలో ఉంది. మూడో టీ20 మ్యాచ్‌లో విజయం తర్వాత.. భారత జట్టు ఆటగాళ్లందరూ జంగిల్ సఫారీకి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను భారత జట్టు ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతాలో షేర్ చేశారు.

ఈ వీడియోలో ఆటగాళ్లంతా అడవిలో జంతువుల ఫొటోలు క్లిక్‌ చేస్తూ కనిపించారు. అయితే.. వైరల్ వీడియోలో స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ మిస్టరీ గ‌ర్ల్‌తో కనిపించాడు. ఈ మిస్టరీ గర్ల్ ఎవరో అని తెలుసుకునేందుకు నెటిజ‌న్లు కుతుహ‌లంతో ఉన్నారు.

హరారే జూకు వెళ్లిన‌ భారత ఆటగాళ్ల వీడియో వైరల్ అవుతోంది. ఇందులో రింకూ సింగ్ ఒక మిస్టరీ అమ్మాయితో తిరుగుతూ కనిపించాడు. ఈ మిస్టరీ గర్ల్ మరెవరో కాదు.. శుభమాన్ గిల్ సోదరి షహనీల్ గిల్. వీడియోలో ఇద్దరూ కలిసి సెల్ఫీలు దిగడం కనిపించింది. ఈ వీడియోపై నెటిజ‌న్లు త‌మ‌దైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. షహనీల్ కూడా ఆ ఫోటోపై వ్యాఖ్యానించారు. రింకూ సింగ్, షహనీల్ మంచి స్నేహితులు అని నివేదిక‌లు చెబుతున్నాయి.

T20 ప్రపంచ కప్ 2024 భారత జట్టులో రింకు సింగ్‌కు చోటు దక్కలేదు. అతడు రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్నాడు. కానీ జింబాబ్వేతో జరుగుతున్న T20 సిరీస్‌లో.. రెండవ T20 మ్యాచ్‌లో రింకు సింగ్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతడు 22 బంతుల్లో 48 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. డెత్ ఓవర్లలో రాణించి అభిషేక్ శర్మకు మంచి మద్దతు ఇచ్చాడు. దీని కారణంగా భారత జట్టు 234 పరుగులు చేయగలిగింది.

Next Story