ఆదుకున్న అశ్విన్‌.. టీమ్ఇండియా 404 ఆలౌట్‌

India all out for 404 in first innings against Bangladesh.బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ త‌న మొద‌టి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Dec 2022 8:15 AM GMT
ఆదుకున్న అశ్విన్‌.. టీమ్ఇండియా 404 ఆలౌట్‌

బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త్ త‌న మొద‌టి ఇన్నింగ్స్‌లో 404 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఓవ‌ర్ నైట్ స్కోర్ ఆరు వికెట్ల న‌ష్టానికి 278 ప‌రుగుల‌తో రెండో రోజు ఆట‌ను కొన‌సాగించిన టీమ్ఇండియా మ‌రో 126 ప‌రుగులు చేసి మిగ‌తా వికెట్ల‌ను కోల్పోయింది.

82 ప‌రుగుల‌తో రెండో రోజు ఆట‌ను కొన‌సాగించిన శ్రేయ‌స్ అయ్య‌ర్ సెంచ‌రీ చేస్తాడ‌ని అనుకుంటే మ‌రో నాలుగు ప‌రుగులు మాత్ర‌మే జోడించి పెవిలియ‌న్‌కు చేరాడు. అప్ప‌టికి జ‌ట్టు స్కోర్ 293/7. ఇక భార‌త ఇన్నింగ్స్ ముగియ‌డానికి ఎంతో సేపు ప‌ట్ట‌ద‌ని బావించిన బంగ్లాకు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌(58), కుల్దీప్ యాద‌వ్‌(40) జోడి షాకిచ్చింది. వీరిద్ద‌రు ఎంతో ఓపిక‌గా బ్యాటింగ్ చేస్తూ ఒక్కో ప‌రుగును జ‌త చేస్తూ బంగ్లా బౌల‌ర్ల స‌హ‌నానికి ప‌రీక్ష‌పెట్టారు. ఈ క్ర‌మంలో అశ్విన్ టెస్టుల్లో 13వ అర్థ‌శ‌త‌కాన్ని న‌మోదు చేశాడు.

అశ్విన్‌ను ఔట్ చేసి ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ఈ జోడిని మెహ‌దీ హ‌స‌న్ విడ‌దీశాడు. అశ్విన్‌-కుల్దీప్ జంట ఎనిమిదో వికెట్‌కు 92 ప‌రుగులు జోడించారు. చివ‌ర్లో ఉమేష్ యాద‌వ్‌(15 నాటౌట్‌) ధాటిగా ఆడ‌డంతో భార‌త్ నాలుగు వంద‌ల ప‌రుగుల మార్క్‌ను దాటింది.

భార‌త బ్యాట‌ర్ల‌లో పుజ‌రా 90, పంత్ 46, రాహుల్ 22, గిల్ 20 ప‌రుగులు చేశారు. బంగ్లా బౌల‌ర్ల‌లో తైజుల్ ఇస్తామ్, మెహ‌దీ హ‌స‌న్ చెరో నాలుగు వికెట్లు తీయ‌గా, ఎబాద‌త్‌, ఖ‌లీద్ అహ్మ‌ద్ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

Next Story
Share it