చ‌రిత్ర సృష్టించిన‌ భారత మహిళల క్రికెట్‌ జట్టు

ఆసియా క్రీడలు-2023 మహిళల క్రికెట్ ఈవెంట్‌లో ఫైనల్ మ్యాచ్ భారత్‌, శ్రీలంక జ‌ట్ల‌ జట్టు మధ్య జరిగింది.

By Medi Samrat  Published on  25 Sept 2023 2:58 PM IST
చ‌రిత్ర సృష్టించిన‌ భారత మహిళల క్రికెట్‌ జట్టు

ఆసియా క్రీడలు-2023 మహిళల క్రికెట్ ఈవెంట్‌లో ఫైనల్ మ్యాచ్ భారత్‌, శ్రీలంక జ‌ట్ల‌ జట్టు మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం లభించింది. సోమవారం భార‌త్‌కు ఆసియా క్రీడ‌ల్లో రెండు స్వర్ణాలు ల‌భించాయి. అంతకుముందు షూటింగ్‌లో భారత్‌కు బంగారు పతకం లభించింది. మహిళల క్రికెట్‌లో స్వర్ణం సాధించడంతో భారత్ పతకాల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. భారత్ ఇప్పటి వరకు మొత్తం 11 పతకాలు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 116 ప‌రుగులు చేసింది. స్మృతి మంథాన 46 ప‌రుగులు, జెమీమా రోడ్రిగేజ్ 42 పరుగుల‌తో రాణించారు. ఛేద‌న‌కు దిగిన శ్రీలంక జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 97 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. భార‌త బౌల‌ర్ల‌లో టీటా సాథూ కేవ‌లం ఆరు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి మూడు వికెట్లు తీసింది.

Next Story