భారత్-దక్షిణాఫ్రికా పూర్తి మ్యాచ్ చూడ‌గ‌ల‌మా.? వెద‌ర్ రిపోర్టు ఇదే..!

2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఆఖరి మ్యాచ్ జరగ్గా.. ఇరు జట్ల మధ్య మరోసారి ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది.

By -  Medi Samrat
Published on : 22 Feb 2026 12:10 PM IST

భారత్-దక్షిణాఫ్రికా పూర్తి మ్యాచ్ చూడ‌గ‌ల‌మా.? వెద‌ర్ రిపోర్టు ఇదే..!

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య సూపర్-8 స్టేజ్ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లూ తమ గ్రూప్ స్టేజ్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. అయితే ఈ రోజు ఒక జట్టు విజయాల పరంపర ఆగిపోవడం ఖాయం.

2024 టీ20 ప్రపంచకప్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఆఖరి మ్యాచ్ జరగ్గా.. ఇరు జట్ల మధ్య మరోసారి ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అహ్మదాబాద్ వాతావరణం ఎలా ఉండబోతుందో ఈ మ్యాచ్ కు ముందు తెలుసుకుందాం. వర్షం ఈ మ్యాచ్‌కు అంతరాయం కలిగించగలదా లేదా అభిమానులు మొత్తం ఓవర్ల మ్యాచ్‌ చూడగలరా? చూద్దాం..

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్‌ మొదట్లో బౌలర్ల‌కు ఉపయోగపడగా.. ఇప్పుడు బ్యాటింగ్‌కు బాగా ఉపయోగపడుతోంది. ఆట సాగుతున్న కొద్దీ, పిచ్ కొద్దిగా నెమ్మదిగా మారుతుంది.. తద్వారా బంతి బ్యాట్ మీద‌కు వస్తుంది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే ఈ సూపర్-8 మ్యాచ్ నల్ల నేల పిచ్‌పై జరగనుంది. ఇది స్పిన్నర్లకు ఉపయోగపడకపోవచ్చు. ఈ పరిస్థితిలో అదనపు స్పిన్నర్‌ను ఎంపిక చేసుకుంటే బాగుంటుందా లేక మ‌రో ఆట‌గాడిని ఎంపిక చేసుకుంటే బాగుంటుందా అనే సందిగ్ధంలో పడింది టీమ్ మేనేజ్‌మెంట్. వాషింగ్టన్ సుందర్ స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ తిరిగి వస్తాడని భావిస్తున్నారు.

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య 'సూపర్-8 మ్యాచ్ జ‌రిగే అహ్మదాబాద్‌లో వాతావరణం ఈ రోజు వేడిగా, స్పష్టంగా ఉంటుందని భావిస్తున్నారు. రోజంతా తేలికపాటి పొగమంచుతో సూర్యరశ్మి ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 36°C ఉండవచ్చు. అభిమానులకు శుభవార్త ఏమిటంటే వర్షం కురిసే అవకాశం లేదు.. అంటే అభిమానులు ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి 40 ఓవర్ల ఆట‌ను చూడగలరు.

Next Story