ఘోర ప‌రాజ‌యంపై స్టాండ్-ఇన్ కెప్టెన్ రిషబ్ పంత్ ఏమ‌న్నాడంటే..?

గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో భారత జట్టును ఓడించింది.

By -  Medi Samrat
Published on : 26 Nov 2025 3:57 PM IST

ఘోర ప‌రాజ‌యంపై స్టాండ్-ఇన్ కెప్టెన్ రిషబ్ పంత్ ఏమ‌న్నాడంటే..?

గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో భారత జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా దక్షిణాఫ్రికా రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. త‌ద్వారా 25 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్‌లో భారత జట్టును ఓడించి దక్షిణాఫ్రికా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ అవమానకరమైన ఓటమి తర్వాత భారత జట్టు స్టాండ్-ఇన్ కెప్టెన్ రిషబ్ పంత్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో మాట్లాడాడు.

ఓట‌మి నిరాశపరిచింది. కానీ మేము జట్టుగా మెరుగ్గా ఆడాలి. ఇంత మంచి క్రికెట్ ఆడినందుకు క్రెడిట్ ప్రత్యర్థి జట్టుకు కూడా చెందుతుంది. దక్షిణాఫ్రికా జట్టు ఖచ్చితంగా ఆధిపత్యం చెలాయించింది. స్వదేశంలో ఆడుతున్నప్పుడు మ‌నం ప్రత్యర్థిని తేలికగా తీసుకోకూడ‌దు. వారు మెరుగైన క్రికెట్ ఆడారు. క్రికెట్‌లో మ‌నం ఎవరినీ తేలికగా తీసుకోలేం.. ఆటగాడిగా, జట్టుగా మ‌నం అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన కొన్ని క్షణాలు మ్యాచ్‌లలో ఉన్నాయి.. కానీ మేము దానిలో మెరుగ్గా రాణించలేకపోయామని అన్నాడు.

ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో భారత్ 7 నెలల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో స్వదేశంలో ఐదు టెస్టుల్లో ఓడిపోయింది. ఇంత తక్కువ సమయంలో భారత్‌ ఇన్ని టెస్టుల్లో ఓడిపోవడం 66 ఏళ్లలో ఇదే తొలిసారి.

Next Story