బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టేస్టు నేటి నుంచి ప్రారంభం అయ్యింది. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరుగుతుంది. ప్రపంచంలోని రెండు బలమైన జట్లు ఒకదానితో ఒకటి తలపడుతున్నందున ప్రపంచం మొత్తం ఈ సిరీస్‌పై దృష్టి పెట్టింది. అయితే ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి భారత బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. కేవలం 150 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆలైట్ అయ్యింది. నితీష్ రెడ్డి(41), రిషబ్ పంత్(37), కేఎల్ రాహుల్(26) మినహా ఏ ఒక్కరూ కాసేపు కూడా క్రీజులో నిలదొక్కకునే ప్రయత్నం చేయలేదు. యశస్వి(0), పడిక్కల్(0) డకౌట్ అవగా.. కోహ్‌లీ(5), దృవ్ జురెల్(11), వాషింగ్టన్ సుందర్(4), హర్షిత్ రాణా(7), కెప్టెన్ బుమ్రా(8) ఇలా వరుసగా విఫలమై పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్ వుడ్‌కు నాలుగు వికెట్లు తీయగా, స్టార్క్, కమ్మిన్స్, మార్ష్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.