గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో 89/7 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని టీమిండియాకు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ ఆఖరి రోజు ఆసక్తికరంగా మారుతుందనగా వరుణుడు షాకిచ్చాడు. భారత్ 8 పరుగులు చేసిన సమయంలో వర్షం వచ్చింది. ఆ తర్వాత మ్యాచ్ భవితవ్యంపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో మ్యాచ్ ను డ్రా గా ప్రకటించారు.
ఇక ఈ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో ఆ జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను క్లీన్‌బోల్డ్ చేయడంతో పాటు మరో బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను పెవిలియన్ చేర్చడంతో బుమ్రా ఆసీస్ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరించాడు. ఆస్ట్రేలియాలో బుమ్రా 10 మ్యాచుల్లో (బ్రిస్బేన్ టెస్టుతో కలిపి) 52 వికెట్లు తీశాడు. కపిల్ 11 మ్యాచుల్లో 51 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరి తర్వాత ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే (10 మ్యాచుల్లో 49 వికెట్లు ఉన్నారు.