భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న ఫ్యాన్స్‌కు ఆ సంబరం కాసేపే దక్కింది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత దేశవాళీలో పునరాగమనం చేసిన విరాట్ కోహ్లీ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. రంజీ మ్యాచ్‌లో రైల్వేస్‌తో జరుగుతోన్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. యశ్ ధుల్ ఔట్ కావడంతో సెకండ్ డౌన్లో క్రీజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. కేవలం 6 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. రైల్వేస్ బౌలర్ సంగ్వాన్ బౌలింగ్‌లో ఆఫ్‌స్టంప్ ఎగిరిపడింది. లైన్ అండ్ లెంగ్త్ బంతిని ఆడటంలో విఫలమైన కోహ్లీ వికెట్‌ను సమర్పించాడు. దీంతో దేశవాళీ క్రికెట్ బరిలోకి దిగి విఫలమైన స్టార్ బ్యాటర్ల తాజా జాబితాలో కోహ్లీ కూడా చేరిపోయాడు.
విరాట్ బ్యాటింగ్‌ను ఆస్వాదిద్దామని వచ్చిన అభిమానులు.. అతడు పెవిలియన్‌కు చేరగానే ఇంటిముఖం పట్టడం ప్రారంభించారు. పుష్కరకాలం తర్వాత దేశవాళీలో పునరాగమనం చేసిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్ర నిరాశపరిచాడు. దీంతో విరాట్ బ్యాటింగ్ చూడ్డానికి వచ్చిన ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. అంతకుముందు విరాట్‌ను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులతో స్టేడియం పూర్తిగా నిడింపోయింది. కోహ్లీ బ్యాటింగ్‌కు వస్తుండగా అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. అయితే తక్కువ రన్స్‌కే ఔటవడంతో నిరాశతో స్టేడియం నుంచి వెనుతిరిగారు. కాగా కోహ్లి చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు.