హైబ్రిడ్ మోడల్ ఒక్కటే మీ ముందు ఉన్న ఆప్షన్.. తేల్చేసిన ఐసీసీ

ICC బోర్డు సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ మాత్రమే పరిష్కారం అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB)కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెలియజేసింది.

By Kalasani Durgapraveen  Published on  30 Nov 2024 2:04 AM GMT
హైబ్రిడ్ మోడల్ ఒక్కటే మీ ముందు ఉన్న ఆప్షన్.. తేల్చేసిన ఐసీసీ

ICC బోర్డు సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ మాత్రమే పరిష్కారం అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB)కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెలియజేసింది. అయితే పీసీబీ మాత్రం హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. అన్ని మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో నిర్వహించాలని పట్టుబట్టింది. ఇది అసలు కుదరదని ఐసీసీ పాక్ కు స్పష్టం చేసింది. పీసీబీ పాకిస్తాన్ ప్రభుత్వంతో అంతర్గతంగా సంప్రదించడానికి ఒక రోజు సమయాన్ని కోరింది. ఐసీసీ బోర్డు నవంబర్ 30న తిరిగి సమావేశమయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుత ప్రతిష్టంభన ఉన్నప్పటికీ, పీసీబీ తమ ప్రభుత్వంతో చర్చల తర్వాత హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించే అవకాశం ఉందని వర్గాలు సూచిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్‌ను నవంబర్ 11న ప్రకటించాలని నిర్ణయించారు. అయితే BCCI, PCB మధ్య ప్రతిష్టంభన చాలా ఆలస్యానికి దారితీసింది. నవంబర్ 2021లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ పొందింది. PCB తన మూడు స్టేడియాలను ఆ సంవత్సరం ప్రారంభంలో పునరుద్ధరించే పనిని ప్రారంభించింది. ఇప్పుడు పాకిస్థాన్ లో టోర్నమెంట్ నిర్వహించకపోతే ఎన్నో ఆర్ధిక సమస్యలు కూడా పాకిస్థాన్ ను వెంటాడుతాయి.


Next Story