అప్పుడు ట్రెంట్ బౌల్ట్.. ఇప్పుడు బెయిర్ స్టో.. క్యాచ్‌లు పట్టుంటేనా..!
ICC Posted Spooky parallels video goes viral.క్యాచ్‌లు పడితేనే మ్యాచులు గెలుస్తాం అనే నానుడి తెలిసిందే. ఎంత కష్టమైన
By తోట వంశీ కుమార్ Published on 11 Nov 2021 12:30 PM ISTక్యాచ్‌లు పడితేనే మ్యాచులు గెలుస్తాం అనే నానుడి తెలిసిందే. ఎంత కష్టమైన క్యాచ్ అయినప్పటికి పట్టక తప్పదు. ఒక్క క్యాచ్ నేలపాలు అయినా సరే మ్యాచ్ ఓడిపోక తప్పదు. అయితే.. ఒక్కొసారి ఒక్క క్యాచ్ మిస్ చేసినా..విశ్వవిజేతగా నిలిచే అవకాశాన్ని దెబ్బతీస్తుంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలువడంలో కీలక పాత్ర పోషించాడు ఆ జట్టు ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. స్టార్ ఆటగాళ్లు తొందరగానే పెవిలియన్ చేరినా.. ఫైనల్‌లో మ్యాచ్‌లో స్టోక్స్ చివరి వరకు నిలిచి ఇంగ్లాండ్‌కు విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్ లో ఓ దశలో స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద కివీస్ ఫీల్డర్ ట్రెంట్ బౌల్ట్ అందుకున్నప్పటికి తనని తాను నియంత్రించుకోలేక బౌండరీ లైన్‌ను టచ్ చేశాడు. దీంతో కివీస్ ఆ మ్యాచ్ ఓడిపోయింది.
సరిగ్గా అలాంటి ఘటననే నిన్న అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో సైతం రిపీట్ అయ్యింది. అయితే.. ఈ సారి న్యూజిలాండ్‌ను విజయం వరించగా.. ఇంగ్లాండ్ ఓడిపోయింది. కివీస్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో నీషమ్ భారీ షాట్‌కు యత్నించాడు. బౌండరీ లైన్ వద్ద ఉన్న ఇంగ్లాండ్ ఫీల్డర్ జానీ బెయిర్ స్టో అద్భుతమైన రీతిలో క్యాచ్ అందుకున్నాడు. డ్రైవ్ చేసి క్యాచ్ అందుకునే క్రమంలో బౌండరీ రోప్‌కు అతడి మోకాలు తాకింది. అంపైర్ సిక్సర్‌గా ప్రకటించాడు. దీంతో నీషమ్(11 బంతుల్లో 27, ఫోర్, 3 సిక్స్‌లు) చెలరేగి ఆడి ఇంగ్లాండ్‌కు విజయాన్ని దూరం చేశాడు.
ఈ రెండు క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'రెండు భయానక సమాంతరాలు' అంటూ ఆ వీడియోకి క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటీజన్లు దీనిపై తమదైన శైలిలో కామెంట్లు పెడతున్నారు.