ఐసీసీ స్పెష‌ల్ అవార్డు.. డాగ్ ఆఫ్ ది మంత్‌

ICC gives Player of the Month award to a DOG.అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ) ప్ర‌తి నెల క్రికెట‌ర్ల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Sept 2021 1:18 PM IST
ఐసీసీ స్పెష‌ల్ అవార్డు.. డాగ్ ఆఫ్ ది మంత్‌

అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌(ఐసీసీ) ప్ర‌తి నెల క్రికెట‌ర్ల‌కు అవార్డులు ప్ర‌క‌టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్ర‌క‌టించిన అవార్డుల్లో ఓ అవార్డును క్రికెట‌ర్ల‌కు ఇవ్వ‌కుండా.. ఓ బుజ్జి కుక్క‌కు ఇచ్చింది. అవును నిజ‌మే. ఐసీసీ డాగ్ ఆప్ మంత్ అవార్డును గెలుచుకున్న ఆ బుజ్జి కుక్క ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై ఐసీసీ ట్విటర్‌లో స్పందింస్తూ.. ఈసారి ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుల్లో ఒక కొత్త అతిథి వచ్చి చేరిందని ట్వీట్ చేసింది. కుక్క బంతిని నోట క‌రుచుకుని టోపీ పెట్టుకున్న ఫోటోను పోస్ట్ చేసింది.

ఇటీవ‌ల ఐర్లాండ్‌లో ఓ టీ20 మ్యాచ్ జ‌రుగుతుండ‌గా.. మ్యాచ్ మ‌ధ్య‌లో ఓ శున‌కం వ‌చ్చింది. బంతిని నోట కురుచుకుని మైదానంలో ప‌రుగులు పెట్టింది. దాన్ని ప‌ట్టుకునేందుకు పీల్డ‌ర్లు దాని వెంట ప‌రుగులు పెట్టారు. చివ‌రికి అది బ్యాట్స్‌మెన్‌కు బంతిని ఇచ్చింది. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌గా.. తాజాగా ఐసీసీ అవార్డు ఇచ్చింది.

Next Story