ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు కీలక మ్యాచ్.. వాతావరణం నుంచి మ్యాచ్ ఫలితం వరకూ ఇంట్రస్టింగ్ విషయాలివే..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 10వ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది.
By Medi Samrat Published on 28 Feb 2025 8:59 AM IST
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో 10వ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో గ్రూప్-బి జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి ముందు గడాఫీ స్టేడియం పిచ్ ఎలా ఉండబోతుందో, లాహోర్ వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియా జట్టు ప్రారంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించింది. కంగారూ జట్టు 352 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. దక్షిణాఫ్రికాతో రావల్పిండిలో జరగాల్సిన రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మరోవైపు తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 107 పరుగుల తేడాతో ఓడిపోయిన ఆఫ్ఘనిస్థాన్.. రెండో మ్యాచ్‌లో పునరాగమనం చేసి ఇంగ్లండ్‌పై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇప్పుడు రెండు జట్లు నేడు తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ డ్రా అయితే.. కంగారూ జట్టు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది.
లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలోని పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ మైదానంలో హై స్కోరింగ్ మ్యాచ్‌లు జరిగాయి. బ్యాట్స్‌మెన్‌కు కలిసివస్తుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుంటుంది.
గడాఫీ స్టేడియంలో జరిగిన మొత్తం మ్యాచ్‌లు- 41
మొదట బ్యాటింగ్ చేసి గెలిచిన మ్యాచ్‌లు - 4
ఛేజింగ్‌లో గెలిచిన మ్యాచ్‌లు – 15
మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు- 322
రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు- 339
వాతావరణం ఎలా ఉందంటే..
ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌కు లాహోర్‌లో వాతావరణం ప్రతికూలంగా ఉందని భావిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 40 నుంచి 70 శాతం వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షం కారణంగా లేదా మైదానం తడిసిపోయి లేదా మ్యాచ్ వాష్ అవుట్ అయినట్లయితే, ఆస్ట్రేలియా నేరుగా సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశిస్తుంది.. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ ఫలితం కోసం వేచి ఉండాలి.
ఇరు జట్ల ప్లేయింగ్-11
ఆఫ్ఘనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికె), ఆర్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), సెడిఖుల్లా అటల్, ఇబ్రహీం జద్రాన్, గుల్బాదిన్ నాయబ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూకీ, నూర్ అహ్మద్.
ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్‌చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, మథ్యూ షార్ట్, తన్వీర్ సంఘా.