క్రికెట్ ప్రేమికుల్లారా.. కొత్త రూల్స్ తెలుసుకోండి
ICC Announces Changes To Playing Conditions, Saliva Use Completely Banned. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని మెన్స్ క్రికెట్ కమిటీ సిఫార్సులను చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (CEC) ఆమోదించింది.
By అంజి Published on 20 Sept 2022 7:00 PM ISTసౌరవ్ గంగూలీ నేతృత్వంలోని మెన్స్ క్రికెట్ కమిటీ సిఫార్సులను చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ (CEC) ఆమోదించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం మ్యాచ్ లకు సంబంధించి అనేక మార్పులను ప్రకటించింది. ఆటకు సంబంధించిన షరతులకు, నిబంధనలకు సంబంధించిన ప్రధాన మార్పులు అక్టోబర్ 1, 2022 నుండి అమలులోకి వస్తాయి.
ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ఈ కొత్త రూల్స్ అములోకి వస్తాయి. ఒకవేళ బ్యాటర్ క్యాచ్ ఔట్ అయితే, అప్పుడు కొత్తగా వచ్చే బ్యాటర్.. స్ట్రయికర్ ఎండ్‌లోనే ఆడుతాడు. క్యాచ్ పట్టడానికి ముందే ఒకవేళ బ్యాటర్లు క్రాస్ అయితే కొత్త బ్యాటర్ నాన్ స్ట్రయికర్ ఎండ్‌లోకి వచ్చేవాడు. ఇప్పుడు ఆ రూల్ మారింది. బంతిని మెరిసేలా చేసేందుకు బౌలర్లు ఉమ్మి రాయడం తెలిసిందే. ఇటీవల కోవిడ్ వల్ల బంతికి ఉమ్మివేయకూడదని ఓ నిషేధాన్ని విధించారు. తాత్కాలికంగా రెండేళ్ల పాటు ఆ నిషేధం కొనసాగింది. ఇప్పుడు ఆ నిషేధాన్ని పర్మినెంట్ చేసేశారు. ఉమ్మి బదులుగా ఇటీవల ప్లేయర్లు.. చెమటతో బంతిని మెరిసేలా చేస్తున్నారు. ఎవరైనా బ్యాటర్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి కొత్త బ్యాటర్ వచ్చే వాడు.
ఆ కొత్త బ్యాటర్ కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే బంతిని ఎదుర్కోనేలా తయారు కావాలి. టెస్టులు, వన్డేల్లో ఈ రూల్‌ను ఫిక్స్ చేశారు. టీ20ల్లో మాత్రం 90 సెకన్ల వ్యవధి ఉంది. గతంలో టెస్టులు, వన్డేల్లో కొత్త బ్యాటర్ క్రీజ్‌లోకి చేరుకునేందుకు మూడు నిమిషాల సమయం ఉండేది. నిర్దేశిత సమయంలో ఒకవేళ బ్యాటర్ రాకుంటే, అప్పుడు ఫీల్డింగ్ కెప్టెన్ టైమౌట్ కోసం అప్పీల్ చేసుకోవచ్చు. బౌలర్ బాల్ వేసేందుకు పరుగెత్తుకు వస్తున్నప్పుడు ఫీల్డింగ్ వైపు ఆటగాళ్లు ఎవరైనా అన్యామైన, ఉద్దేశ పూర్వక కదలికలకు పాల్పడితే ఆ బాల్‌ను అంపైర్ డెడ్ బాల్‌గా పరిగణించడమే కాకుండా, బ్యాటింగ్ వైపుకు 5 పెనాల్టీ పరుగులు ఇవ్వబడతాయి. రన్ ఔట్‌ను ప్రభావితం చేసే ఈ పద్దతిని అనుచిత ఆట విభాగం నుంచి రన్ ఔట్ విభాగానికి మార్చడానికి ఆట నిబంధనలను చట్టాలను అనుసరిస్తాయి.
రెండు జట్లు అంగీకరిస్తే, అన్ని పురుషుల, మహిళల ODI, T20I మ్యాచ్‌ల ఆటల పరిస్థితులను హైబ్రిడ్ పిచ్‌లను ఉపయోగించుకునేలా సవరించాలని కూడా నిర్ణయించారు. ప్రస్తుతం మహిళల టీ20 మ్యాచ్‌ల్లో మాత్రమే హైబ్రిడ్ పిచ్‌లను వినియోగిస్తున్నారు.