ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ గెలవదట
I don't see England winning any Test against India. అతి త్వరలో భారత్ తో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మొదలుకాబోతూ ఉంది.
By Medi Samrat Published on 2 Feb 2021 3:12 PM ISTఅతి త్వరలో భారత్ తో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ మొదలుకాబోతూ ఉంది. ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ ఫేవరేట్ అయినప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టును తక్కువగా అంచనా వేయలేం..! అయితే భారత జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలిచే అవకాశాలు లేవని అంటున్నారు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో జో రూట్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఒక్క టెస్టును కూడా గెలవడం కష్టమని గంభీర్ అభిప్రాయపడ్డారు. స్పిన్నర్‌లకు స్వర్గధామమైన భారత పిచ్‌లపై ఇంగ్లీష్ జట్టు పేలవమైన స్పిన్ అటాక్‌తో బరిలోకి దిగుతుందని, ఇది టీమిండియాకు కచ్చితంగా కలిసొచ్చే విషయమని అన్నారు. ఇంగ్లండ్ స్పిన్ విభాగానికి సారధ్యం వహిస్తున్న మొయిన్ అలీ మినహా మిగతా స్పిన్నర్లెవరూ భారత్‌పై అంతగా ప్రభావం చూపలేరన్నారు. స్టార్ స్పోర్ట్స్ షో 'గేమ్ ప్లాన్'లో గౌతమ్ గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ ఒక్క టెస్టును కూడా గెలవడం కష్టమే. టెస్టు సిరీస్‌ను టీమిండియా 3-0తో గెలుచుకుంటుంది. మహా అయితే 3-1తో గెలుస్తుంది. పింక్ బాల్ టెస్టు మ్యాచ్ విషయంలోనే నేను కొంత ఆలోచిస్తున్నా. పరిస్థితులను బట్టి ఈ మ్యాచులో గెలుపు అవకాశాలు 50-50గా ఉంటాయని అనుకుంటున్నానని వెల్లడించారు గంభీర్.
ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ శ్రీలంకలో అద్భుతంగా ఆడాడు. సెంచరీలు బాదాడు. ఈ సిరీస్‌లో రూట్ మరోసారి కీలకం అవనున్నాడు. శ్రీలంక బౌలర్లలో పోల్చితే.. భారత్ బౌలింగ్ పటిష్టంగా ఉంది. రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా వంటివారిని రూట్ ఎదుర్కోవాల్సి రావడం అతడికి సవాలేనని చెప్పుకొచ్చారు గంభీర్. ఇంగ్లండ్ స్పిన్ విభాగానికి సారధ్యం వహిస్తున్న మొయిన్ అలీ మినహా మిగతా స్పిన్నర్లెవరూ భారత్‌పై అంతగా ప్రభావం చూపలేరని చెబుతున్నారు గంభీర్.
Next Story