వివియన్ రిచర్డ్స్ ఆగ్రహం.. ముందు ఆటపై దృష్టి పెట్టండి అంటూ కామెంట్..!

I am confused about moaning and groaning about pitch. మొతేరా పిచ్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ స్పందించాడు.

By Medi Samrat
Published on : 1 March 2021 8:45 PM IST

Vivian Richards

మొతేరా పిచ్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ స్పందించాడు. స్పిన్ పిచ్ పై ఫిర్యాదులు చేస్తున్న ఇంగ్లాండ్ జట్టును విమర్శించాడు. నాలుగో టెస్టులోనూ ఈ తరహా పిచ్ ను తయారు చేయాలని అభిప్రాయపడ్డాడు.

ఇప్పుడు ఇంగ్లాండ్ టీమ్ కు స్పిన్ గురించి ఒక అవగాహన రావొచ్చని రిచర్డ్స్ అభిప్రాయపడ్డాడు. తర్వాతి మ్యాచ్ లో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఈ అనుభవం మీకు ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. తదుపరి టెస్టులోనూ ఇదే తరహా వికెట్ ఉంటుందని అంచనా వేశాడు. ఆ స్థానంలో నేనున్నా.. స్పిన్ పిచ్ నే తయారు చేస్తానని వివియన్ స్పష్టం చేశాడు."ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. మొదటి టెస్టుకు ముందు ఉన్నంత సౌకర్యంగా రెండు, మూడు టెస్టుల తర్వాత లేరు. వారు స్పిన్ పిచ్లనే అభద్రత భావంలోకి వెళ్లారు. మేం ఆడుతున్నది స్పిన్ వికెట్ అనే విధంగా వారు మానసికంగా సిద్ధమవ్వాలి" అని విండీస్ క్రికెట్ దిగ్గజం సూచించాడు.

స్పిన్నర్లకు సహకరిస్తున్న చెపాక్, మొతేరా వికెట్లపై.. కీపింగ్ చేయడం కష్టంగా ఉందని ఇంగ్లాండ్ కీపర్ బెన్ ఫోక్స్ తెలిపాడు. ఇంతకుముందేప్పుడూ ఇలాంటి పిచ్ ల‌ను చూడలేదని పేర్కొన్నాడు. తొలిరోజే ఐదో రోజులా ఉందని అభిప్రాయపడ్డాడు.మార్చి 4 నుంచి అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో చివరి టెస్టు ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన ఇంగ్లాండ్.. నాలుగో టెస్టు గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావిస్తుంది. భారత్ చివరి టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ ను 3-1తో చేజిక్కుంచుకోవాలని భావిస్తోంది.


Next Story