Video : నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్స్ బాది గెలిపించిన హెట్మెయర్
మేజర్ క్రికెట్ లీగ్‌లో సీటెల్ ఓర్కాస్ చరిత్ర సృష్టించింది. ఎంఐ న్యూయార్క్‌పై చివరి బంతికి సిక్స్‌తో గెలిచి సీటెల్ ఈ ఘనత సాధించింది.
By Medi Samrat
మేజర్ క్రికెట్ లీగ్‌లో సీటెల్ ఓర్కాస్ చరిత్ర సృష్టించింది. ఎంఐ న్యూయార్క్‌పై చివరి బంతికి సిక్స్‌తో గెలిచి సీటెల్ ఈ ఘనత సాధించింది. సీటెల్ ఓర్కాస్ విజయంలో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హెట్మెయర్ కీలక పాత్ర పోషించాడు. శనివారం జరిగిన ఈ ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్‌లో 238 పరుగులు చేధించి సియాటెల్ ఓర్కాస్ ఎంఐ న్యూయార్క్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. MI కెప్టెన్ నికోలస్ పూరన్ 60 బంతుల్లో 108 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. మరో బ్యాట్స్‌మెన్ తజిందర్ ధిల్లాన్ కూడా 35 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 95 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చేధనకు దిగిన సీటెల్ ఓర్కాస్‌కు పేలవమైన ఆరంభం లభించింది. టాపార్డర్ విఫలమవడంతో 138 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది.
అటువంటి పరిస్థితిలో షిమ్రాన్ హెట్మెయర్ జట్టులోని ఇతర ఆటగాళ్లతో చిన్నపాటి భాగస్వామ్యాలు చేసి జట్టును విజయానికి చేరువ చేసి తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా, చివరి 2 ఓవర్లలో 32 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో హెట్మెయర్ 19వ ఓవర్ వేసిన ఎహ్సాన్ ఆదిల్ బౌలింగ్‌లో చివరి మూడు బంతుల్లో మూడు ముఖ్యమైన సిక్సర్లు కొట్టాడు. దీంతో విజయానికి చివరి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం. చివరి ఓవర్ బౌలింగ్ వేసేందుకు పొలార్డ్ వచ్చాడు. తొలి మూడు బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. నాలుగో బంతి డాట్ బాల్. ఐదో బంతికి హెట్మెయర్ రెండు పరుగులు చేశాడు. చివరి బంతికి 6 పరుగులు చేయాల్సి ఉంది. పొలార్డ్ స్లో లెంగ్త్ బంతిని వేశాడు. దీనిని హెట్మెయర్ ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. చివరికి హెట్మెయర్ 40 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
SHIMRON HETMYER - THE HERO. 🔥
— Tanuj (@ImTanujSingh) June 28, 2025
- Shimron Hetmyer smashed a Six when his team needed 6 of 1 ball. He smashed 97*(40) with 5 fours and 9 Sixes. pic.twitter.com/cAmr1W9lbq