న‌మ్మ‌శ‌క్యం కానీ క్యాచ్ ప‌ట్టిన భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌.. వీడియో వైర‌ల్

Harleen Deol Sensational Catch.ఇటీవ‌ల కాలంలో మ‌హిళ‌ల క్రికెట్‌కు ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఇక ఉమెన్స్ క్రికెటర్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 July 2021 6:24 AM GMT
న‌మ్మ‌శ‌క్యం కానీ క్యాచ్ ప‌ట్టిన భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌.. వీడియో వైర‌ల్

ఇటీవ‌ల కాలంలో మ‌హిళ‌ల క్రికెట్‌కు ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఇక ఉమెన్స్ క్రికెటర్లు కూడా ఫీల్డింగ్‌లో అద్భుతాలు చేస్తున్నారు. మొన్న స్మృతి మంధాన ప‌ట్టిన అద్భుత క్యాచ్‌ను ఇంకా మ‌రిచిపోక ముందే తాజాగా మ‌రో ఇండియ‌న్ ఉమెన్ క్రికెట‌ర్ ఎవ్వ‌రూ ఊహించ‌ని క్యాచ్ అందుకుంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప‌లువురు మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు అభిమానులు, నెటిజ‌న్లు ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇంత‌కీ ఎవ‌రని అంటారా.. టీమ్ ఇండియా యువ క్రికెట‌ర్ హ‌ర్లీన్ డియోల్‌.

ప్ర‌స్తుతం భార‌త మ‌హిళల జ‌ట్టు ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టిస్తోంది. నార్తాంప్టన్ కంట్రీ గ్రౌండ్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హిట్టర్ అమీ జోన్స్ (43: 27 బంతుల్లో 4పోర్లు, 2సిక్స‌ర్లు) దూకుడుగా ఆడుతోంది. ఇన్నింగ్స్ చివరి దశకు చేరుకోవడంతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తోంది. 19వ ఓవర్ వేసిన భారత పేసర్ శిఖా పాండే బౌలింగ్‌లో లాంగాఫ్ దిశగా జోన్స్ భారీ షాట్ ఆడింది. బంతి బౌండరీ లోపల పడేలా కనిపించింది. ఇక్కడే హర్లీన్ మాయ చేసింది.

బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్ డియోల్ సిక్స్‌గా వెళ్తున్న బంతిని గాల్లోకి ఎగిరి క్యాచ్‌ అందుకుంది. అయితే ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పిపోయిన డియోల్.. బంతిని గాల్లోకి విసిరింది. బౌండ‌రీ అవ‌త‌లికి వెళ్లి మ‌ళ్లీ గాల్లోని బంతిని అందుకునేందుకు మైదానంలోకి డ్రైవ్ చేసింది. దాంతో విస్తుపోయిన అమీ జాన్స్ నిరాశ‌తో పెవిలియ‌న్ చేరింది. హ‌ర్లీన్ జ‌ట్టు స‌భ్యులు అభినందిచ‌గా.. ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా చప్పట్లతో అభినందించింది.

ప్ర‌స్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మాజీ క్రికెట‌ర్ల‌తో పాటు నెటిజ‌న్లు ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జ‌ట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. నటాలియే సివర్​ (55) అర్ధ శతకం చేయగా.. జోన్స్ ​(43) రాణించింది. అనంతరం ఛేదనలో భారత్ జట్టు 8.4 ఓవర్లు ముగిసే సమయానికి 54/3తో నిలిచిన దశలో వర్షం పడింది. దీంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తితో ఇంగ్లాండ్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు. ఇరు జ‌ట్ల మ‌ధ్య ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Next Story
Share it