ముంబై ఇండియన్స్ జట్టు టీమ్ బస్సు ఎక్కిన అమ్మాయి గురించి చర్చ జరుగుతూ ఉంది. ఆమె హార్దిక్ పాండ్యా స్నేహితురాలని కొన్ని మీడియా సంస్థలు చెబుతూ ఉన్నాయి. జాస్మిన్ వాలియా తాజాగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కనిపించడంతో, ఆమె హార్దిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. జాస్మిన్ వాలియా సోమవారం నాడు KKR పై విజయం తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు బస్సు ఎక్కుతుండగా కనిపించింది. స్టాండ్ల నుండి ముంబై ఇండియన్స్ జట్టును ఎంకరేజ్ చేస్తూ కూడా జాస్మిన్ వాలియా కనిపించింది.
ఇక ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంది. వాంఖడే స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు 8 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ 12.5 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్ లో ముంబై ఆటగాడు అశ్వనీకుమార్ అరంగేట్ర మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టి.. ఆ ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు.