నెంబర్ 1 పాండ్యా.. సరికొత్త చరిత్ర

2024 T20 ప్రపంచ కప్‌లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించడమే కాకుండా.. భారత జట్టుకు టైటిల్ ను కూడా అందించాడు.

By Medi Samrat  Published on  3 July 2024 9:14 PM IST
నెంబర్ 1 పాండ్యా.. సరికొత్త చరిత్ర

2024 T20 ప్రపంచ కప్‌లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించడమే కాకుండా.. భారత జట్టుకు టైటిల్ ను కూడా అందించాడు. తాజాగా ICC పురుషుల T20I ఆల్-రౌండర్ ర్యాంకింగ్‌లో నం.1 స్థానానికి చేరుకున్నాడు. ఈ స్టార్ ఆటగాడు రెండు స్థానాలకు ఎగబాకి, శ్రీలంకకు చెందిన వనిందు హసరంగాతో సమానంగా పురుషుల T20Iలో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ 222 రేటింగ్ పాయింట్లతో సమంగా ఉన్నారు.

జూన్ 29న శనివారం నాడు బార్బడోస్‌లోని కెన్సిగ్టన్ ఓవల్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా భారతజట్టుకు హీరోగా అవతరించాడు. దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్లు హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌ను ఔట్‌ చేసి భారత్‌ను విజేతగా నిలిపారు. ఈ టోర్నీలో పాండ్యా 6 ఇన్నింగ్స్‌లలో 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ 11 వికెట్లు పడగొట్టాడు.

Next Story