హార్దిక్ పాండ్యా ఇంట విషాదం
Hardik Pandya father Himanshu Pandya passed away.భారత ఆటగాళ్లు హార్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఇంట విషాదం నెలకొంది.
By తోట వంశీ కుమార్ Published on
16 Jan 2021 5:13 AM GMT

భారత ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఇంట విషాదం నెలకొంది. వారి తండ్రి హిమాన్షు పాండ్యా కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గుండెపోటుతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న వెంటనే కృనాల్ పాండ్యా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నుంచి తప్పుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో బరోడా జట్టుకు కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఎంపిక కాని హార్థిక్ పాండ్యా ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో ముంబై ఇండియన్ తరుపున ఆడి సత్తా చాటిని పాండ్య బ్రదర్స్.. టీమ్ఇండియాలో చోటు సంపాదించారు. తమ్ముడు హార్థిక్ పాండ్య .. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌తో భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నా.. సుదీర్థ ఫార్మాట్‌లో మాత్రం తన స్థానాన్ని పదిలం చేసుకోలేదు. ఇటీవలే హార్థిక్ తండ్రైన విషయం తెలిసిందే.
Next Story