నటాషాకు హార్దిక్ పాండ్యా విడాకులు, అధికారిక ప్రకటన
టీమిండియా ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా తన లైఫ్ పార్ట్‌నర్ నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటన చేశాడు.
By Srikanth Gundamalla Published on 19 July 2024 7:20 AM ISTనటాషాకు హార్దిక్ పాండ్యా విడాకులు, అధికారిక ప్రకటన
టీమిండియా ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా తన లైఫ్ పార్ట్‌నర్ నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటన చేశాడు. ఈ మేరకు అధికారికంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అయితే.. గత కొంతకాలంగా వీరిద్దరూ విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై గతంలో స్పందించిన ఇద్దరూ.. అలాంటిదేమీ లేదంటూ వార్తలను కొట్టిపాడేశారు. కానీ.. ఇంతలోనే ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటన చేయడం సంచలనంగా మారింది.
ఈ మేరకు హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాడు. తామిద్దరం విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. ఇది ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయం అని చెప్పాడు. కఠినమైన డెసిషన్ అయినప్పటికీ పరస్పర గౌరవంతో ఈ అడుగు వేయాల్సి వచ్చిందని ఇన్‌స్టా పోస్టులో హార్దిక్ పాండ్యా రాసుకొచ్చాడు.
'నాలుగేళ్లు కలిసి ఉన్నాం. పరస్పరం విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మేము అన్ని విధాలా ప్రయత్నం చేశాం. ఇది కఠిన నిర్ణయమే అయినా.. పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒక కుటుంబంగా ఎదిగిన మేము ఈ ప్రయాణాన్ని బాగా ఎంజాయ్ చేశాం. మా అబ్బాయి అగస్త్యకు మంచి కో-పేరెంట్స్‌గా ఉంటాం. అతన్ని సంతోషంగా ఉంచడం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధం. ఈ కష్ట సమయంలో మా గోప్యతను గౌరవిస్తూ మద్దతు ఇవ్వాలని అందరినీ కోరుతున్నా.' అని ఇన్‌స్టా గ్రామ్‌లో హార్దిక్ పాండ్యా రాసుకొచ్చాడు.
Hardik Pandya and Natasha part ways. pic.twitter.com/gnTNI7Lduu
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 18, 2024