Video : సిగ్గుచేటు.. జోఫ్రా ఆర్చర్‌ను అలా పిలిచి నెటిజన్ల అగ్రహానికి గురైన భజ్జీ
భారత జట్టు మాజీ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను వివాదాలు చుట్టుముట్టాయి.
By Medi Samrat
భారత జట్టు మాజీ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను వివాదాలు చుట్టుముట్టాయి. ఐపీఎల్ 2025లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హర్భజన్ సింగ్, రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై జాతిపరమైన వ్యాఖ్యలు చేశాడు. దీని కారణంగా.. భజ్జీపై సోషల్ మీడియాలో చాలా విమర్శలు వచ్చాయి.. దీంతో ఆయనను నిషేధించాలనే డిమాండ్ కూడా వచ్చింది.
IPL 2025 రెండవ మ్యాచ్ ఆదివారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. జోఫ్రా ఆర్చర్ గురించి మాట్లాడుతూ భజ్జీ.. బ్లాక్ టాక్సీని ఉదాహరణగా ఇచ్చాడు.. దీంతో అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. మ్యాచ్ సందర్భంగా హర్భజన్ సింగ్ వ్యాఖ్యానిస్తూ.. 'లండన్‌లో బ్లాక్ టాక్సీ మీటర్ వేగంగా నడుస్తుందని పేర్కొన్నాడు.
సోషల్ మీడియాలో యూజర్లు హర్భజన్ సింగ్‌ను తీవ్రంగా విమర్శించారు. భజ్జీ వ్యాఖ్యానంపై నిషేధం విధించాలని కొందరు వినియోగదారులు డిమాండ్ చేయగా.. ఒక విభాగం హర్భజన్ సింగ్‌ను క్షమాపణలు కోరింది. అయితే ఈ విషయంపై వార్తలు రాసే వరకు హర్భజన్ సింగ్ వైపు నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.
Racism at Peak 😂😂😂😂
— B I S W A J E E T (@Biswajeet_2277) March 23, 2025
Harbhajan Singh Calling Archer Kali Taxi pic.twitter.com/ijdEqFgNbX
'హిందీ వ్యాఖ్యానంలో జోఫ్రా ఆర్చర్‌ను హర్భజన్ సింగ్ అధిక మీటర్ విలువ కలిగిన బ్లాక్ టాక్సీ డ్రైవర్ అని పిలిచాడు. ఇది అసహ్యంగా ఉందని నెటిజన్ ఫైర్ అయ్యాడు.
'హర్భజన్ క్షమాపణ చెప్పాలి. IPL వ్యాఖ్యానం సమయంలో ఆయన జోఫ్రా ఆర్చర్‌ను బ్లాక్ లండన్ టాక్సీ అని పిలిచాడు.. సిగ్గుచేటు అని మరో నెటిజన్ మండిపడ్డాడు.
హర్భజన్ సింగ్‌ను అవమానించిన జోఫ్రా ఆర్చర్‌కు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ పీడకలగా మారింది. ఆర్చర్ తన 4 ఓవర్ల కోటాలో 76 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ కూడా తీయలేదు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన బౌలింగ్ స్పెల్ వేసిన బౌలర్‌గా ఆర్చర్ నిలిచాడు.
ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 44 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 286/6 స్కోరు చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేయగలిగింది.