హర్భజన్ సింగ్‌కి కరోనా

Harbhajan Singh tests positive for COVID-19.భార‌త మాజీ ఆట‌గాడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2022 2:38 PM IST
హర్భజన్ సింగ్‌కి కరోనా

భార‌త మాజీ ఆట‌గాడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించాడు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని, హోం క్వారంటైన్‌లో ఉన్న‌ట్లు చెప్పారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో హ‌ర్భ‌జ‌న్ సింగ్ పాల్గొనాల్సి ఉండ‌గా.. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో టోర్నీకి దూరంగా ఉన్నాడు.

'నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయి. అన్ని జాగ్ర‌త్త‌లు పాటిస్తూ.. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవ‌ల నన్ను కలిసిన వారందరూ టెస్టు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా. జాగ్రత్తగా ఉండండి' అంటూ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు .

1998లో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన హర్భజన్ సింగ్ గ‌తేడ‌ది డిసెంబ‌ర్‌లో రిటైర్‌మెంట్ ప్ర‌కటించారు. 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20ల్లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హించాడు. వ‌రుస‌గా 417, 269, 25 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్)లో 163 మ్యాచ్‌లు ఆడిన భ‌జ్జీ 150 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Next Story