దేశ భ‌క్తిని ప్ర‌తిబింబిస్తోన్న‌'హ‌ర్ ఘ‌ర్ తిరంగా' సాంగ్‌

Har Ghar Tiranga anthem for 75th Independence Day released.దేశ 75వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2022 7:25 AM IST
దేశ భ‌క్తిని ప్ర‌తిబింబిస్తోన్న‌హ‌ర్ ఘ‌ర్ తిరంగా సాంగ్‌

దేశ 75వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు భారీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్ప‌టికే 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పేరుతో ప్ర‌త్యేక ప్ర‌చారం చేస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం. ఆగస్ట్ 13-15 వరకు ప్ర‌తి ఇంటిపై జాతీయ జెండా ఎగుర‌వేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇప్ప‌టికే పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో 'హర్ ఘర్ తిరంగ' (ప్రతి ఇంట త్రివర్ణ పతాకం) పాటను విడుద‌ల చేశారు.

ఈ పాట‌లో సినీ న‌టులు అమితాబ్ బ‌చ్చ‌న్‌, అక్ష‌య్ కుమార్‌, ప్రభాస్, అజ‌య్‌దేవ్‌గ‌న్‌, కీర్తి సురేష్‌, అనుష్క శ‌ర్మ‌తో పాటు క్రీడాకారులు క‌పిల్ దేవ్‌, విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా, పీవీ సింధు త‌దిత‌రులు క‌నిపించారు. ఆశా భోంస్లే మధురమైన స్వరం దేశభక్తులను మంత్రముగ్దులను చేస్తోంది. ప్రముఖ గాయకుడు సోను నిగమ్ కూడా ఈ పాటలో పాలు పంచుకున్నారు. ప్రభాస్ జాతీయ జెండాను ఒక చేత్తో పట్టుకుని ఉండగా.. ఆయనపై జాతీయ పతాకం ఉన్న హెలికాప్టర్ ఎగురుతూ కనిపించింది. ఇక ఈ పాట‌కు దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించినట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story