ఆంధ్ర జట్టుకే ఆడాలనుకుంటున్న హనుమ విహారి

కొన్ని నెలల కిందట ఆంధ్రా జట్టు నుండి వైదొలగాలని నిర్ణయించుకుంటున్నానని.. అప్పటి అధికారపార్టీ నేత కొడుకు కారణంగా తాను అవమానం పాలయ్యానంటూ హనుమ విహారి చేసిన ఆరోపణలు అప్పటి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

By Medi Samrat  Published on  30 July 2024 9:45 PM IST
ఆంధ్ర జట్టుకే ఆడాలనుకుంటున్న హనుమ విహారి

కొన్ని నెలల కిందట ఆంధ్రా జట్టు నుండి వైదొలగాలని నిర్ణయించుకుంటున్నానని.. అప్పటి అధికారపార్టీ నేత కొడుకు కారణంగా తాను అవమానం పాలయ్యానంటూ హనుమ విహారి చేసిన ఆరోపణలు అప్పటి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఇప్పుడు హనుమ విహారి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాబోయే దేశవాళీ క్రికెట్ సీజన్‌లో ఆంధ్ర జట్టు కే ప్రాతినిధ్యం వహించనున్నాడు.

గత ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్‌తో జరిగిన ఆంధ్రా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తర్వాత, ఆంధ్ర క్రికెట్‌లో రాజకీయ జోక్యాన్ని విమర్శిస్తూ.. విహారి ఆంధ్ర జట్టు నుండి నిష్క్రమిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించాడు. "నేను ఎప్పటికీ ఆంధ్రా తరపున ఆడను. నా గౌరవానికి భంగం కలిగించారు. తనను కెప్టెన్‌గా తొలగించాలనే నిర్ణయం ఓ రాజకీయ నాయకుడు తీసుకుందని ఆరోపించాడు." అప్పట్లో ఆరోపించాడు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మార్పు రావడంతో హనుమ విహారి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్ర కెప్టెన్సీ పగ్గాలు హనుమ విహారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

Next Story